రైతులకు వ్యవసాయ శాఖ అలర్ట్.. వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరిక

by Aamani |
రైతులకు వ్యవసాయ శాఖ అలర్ట్.. వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరిక
X

దిశ,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట వ్యవసాయ శాఖ పలు గ్రామాల రైతులకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలపడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు అలర్ట్ అయ్యారు. దమ్మపేట మండలంలోని నాగుపల్లి, నాచారం, గణేష్ పాడు గ్రామాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని రైతులు రెండు రోజుల పాటు తమ పంట కోతలను వాయిదా వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులను కోరుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వడగళ్ల వాన పడి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇక్కడ కూడా వర్షాలు కురుస్తాయని రైతులకు తెలపడం భానుడి సీజన్ లో వర్షం సడన్ ఎంట్రీ ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Next Story