- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మంచు ఫ్యామిలీ వివాదం.. ఈ సారి అక్కడ చూసుకుందాం అంటూ అన్నకు మనోజ్ వార్నింగ్!

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా మంచు ఫ్యామిలీలో వివాదాలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ (Manchu Manoj)వర్సెస్ విష్ణు (manchu vishnu) అన్నట్లు మారిపోయింది వారి తీరు. అయితే మోహన్ బాబు(Mohan Babu), మంచు మనోజ్ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా దాడి కూడా చేసుకున్నారు. మధ్యలో పోయినందుకు ఓ రిపోర్టర్‌పై కూడా దాడి చేయడంతో నెట్టింట దుమారం అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కేసు కూడా నమోదు కావడంతో కోర్టుకు కూడా వెళ్లారు. అయితే మోహన్ బాబు అతనికి కొంత డబ్బును ఇస్తాను అని ఒప్పుకున్నారు.
ఇక్కడితే ఆ కేసు ముగిసింది. కానీ మంచు ఫ్యామిలీ వివాదం మాత్రం రోజు రోజుకు ముదురుతుంది తప్ప వారు కలిసిపోవడం లేదు. నిత్యం సోషల్ మీడియాలో వార్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే గొడవలు అయిన తర్వాత ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజు రావడంతో మనోజ్ ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యామిలీ మొత్తం కలిసిపోతారని అనుకున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మంచు మనోజ్ తన అన్నకు ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. విష్ణుకు పోటీగా రాబోతున్నట్లు వెల్లడించాడు. ఓ షోలో పాల్గొన్న ఆయన తాను నటిస్తున్న ‘భైరవం’ కన్నప్పకు పోటీగా విడుదల కాబోతున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా బుల్లితెరపై కాదు వెండితెరపై చూసుకుందాం అని వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం మంచు మనోజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న తాజా మూవీ ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో పలువురు స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ‘కన్నప్ప’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతుంది. ఇక మంచు మనోజ్ నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే మంచు మనోజ్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు.
Read More..
Viral video: మెగాస్టార్ చిరంజీవి ఓ దుర్మార్గుడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ హీరో