WPL 2025 : డబ్ల్యూపీఎల్ చాంపియన్‌గా ముంబై.. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో ఢిల్లీపై సూపర్ విక్టరీ

by Harish |
WPL 2025 : డబ్ల్యూపీఎల్ చాంపియన్‌గా ముంబై.. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో ఢిల్లీపై సూపర్ విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) టైటిల్‌ను ముంబై ఇండియన్స్ ఎగరేసుకుపోయింది. ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను చిత్తు చేసి రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. 2023 ఆరంభ సీజన్‌లో ముంబై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో ముంబై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(66) హాఫ్ సెంచరీతో రాణించడంతో పోరాడే స్కోరు దక్కింది. నాట్ స్కివర్ బ్రంట్(30) విలువైన పరుగులు జోడించింది. అనంతరం ఛేదనకు దిగిన ప్రత్యర్థిని ముంబై బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 141 రన్స్‌‌కే పరిమితమైంది. రోడ్రిగ్స్(30) పర్వాలేదనిపించగా.. మారిజన్నె కాప్(40) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఒక దశలో ఢిల్లీనే గెలిచేలా కనిపించింది. కానీ, ముంబై బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. నికీ ప్రసాద్(25 నాటౌట్) ఆఖర్లో పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో ఢిల్లీకి మళ్లీ నిరాశ తప్పలేదు. వరుసగా మూడో సీజన్‌లో ఫైనల్‌లోనూ ఓడింది.


Next Story