MP: సస్పెన్షన్ కాదు.. జగదీష్ రెడ్డిని శాశ్వతంగా బహిష్కరించాలి

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-15 18:21:15.0  )
MP: సస్పెన్షన్ కాదు.. జగదీష్ రెడ్డిని శాశ్వతంగా బహిష్కరించాలి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాస్వామ్యంలో ప్రతీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. బీఆర్ఎస్(BRS) నేతలు ఆల్రెడీ వందకు పైగా తప్పులు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.. అయినా కింద పడ్డా పైచేయి మాదే అనేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్(Congress) ఎంపీ మల్లు రవి(Mallu Ravi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నిండు అసెంబ్లీలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) సస్పెండ్ చేయడం కాదు.. శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అహంకార ధోరణి సరికాదు.. స్పీకర్ దళితుడు కాబట్టే జగదీష్ రెడ్డి రెచ్చిపోయాడని మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం వివరణ ఇవ్వాలని అన్నారు.

దేశంలో కులగణన చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, నిరుద్యోగులకు ఇలా అందరికీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే న్యాయం చేసిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. అలాంటి వ్యక్తిపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తోన్న ఆదరణ చూసి బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. వచ్చే పదేళ్లు కాదు.. 20 ఏళ్లు కాంగ్రెస్సే అధకారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Read More..

CM Revanth: వాళ్లు అలా పిలుస్తుంటే.. చాలా ఆనందంగా ఉంది

Next Story