- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
by Kalyani |

X
దిశ, మీర్ పేట్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడ్డ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగరాజు వివరాల ప్రకారం..కస్తూరి కాలనీ, హస్తినాపురానికి చెందిన లోగిట్ల మధుసూదన్ (35) వృత్తి రీత్యా డ్రైవర్ గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఆదివారం ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి బావా సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Next Story