గురుకులాల్లోని విద్యార్థులకు అవి ఏర్పాటు చేయండి.. ప్రభుత్వ విప్ కీలక విజ్ఞప్తి

by Ramesh Goud |
గురుకులాల్లోని విద్యార్థులకు అవి ఏర్పాటు చేయండి.. ప్రభుత్వ విప్ కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని గురుకులాల్లో గీజర్లు (Geasers) ఏర్పాటు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Adi Srinivas) విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) జోరుగా కొనసాగుతున్నాయి. శనివారం వాయిదా పడిన శాసన సభా సమావేశాలు తిరిగి ఇవాళ ప్రారంభమయ్యాయి. నేడు సభలో గురుకులాల (gurukulas) నిర్వహణపై చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Governent) పెంచిన డైట్ చార్జీలు (Diet Charges), కాస్మోటిక్ చార్జీల (Cosmotic Charges) అమలుపై సభలో మంత్రి సీతక్క (Minister Seethakka) వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో విద్యార్థుల సమస్యల గురించి సభలో కీలక విజ్ఞప్తి చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పక్షాన గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తాను ఇటీవల కొన్ని గురుకుల పాఠశాలలు తిరిగి పరిశీలించానని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము వేకువజామునే లేచి చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, కాబట్టి తమకు గీజర్లు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. కొన్ని హస్టళ్లలో సోలార్ పవర్ (Solar Power) తో నడిచే గీజర్లు ఉన్నాయని, కానీ మెజారిటీ స్కూళ్లలో లేవని అన్నారు. రాష్ట్రంలోని అన్నీ గురుకులాల్లో సోలార్ పవర్ తో నడిచే గీజర్లు ఏర్పాటు చేసి, విద్యార్థులు వేకువజామున లేచి చదువుకునేందుకు దోహదపడాలని ఆది శ్రీనివాస్ కోరారు.

Next Story

Most Viewed