- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Meerut : మీరట్ హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో హత్యకు గురైన మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు మీడియాతో పంచుకున్నారు. నెలల తరబడి సౌరభ్ హత్యకు ప్రణాళికలు వేశారని చెప్పుకొచ్చారు. రెండుసార్లు విఫలయత్నం అయ్యిందన్నారు. ముస్కాన్ నవంబర్ 2023 నుండి సౌరభ్ హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కానీ మార్చి 4న చివరకు తమ ప్రణాళిక ప్రకారం హత్య చేశారని అన్నారు. ఫిబ్రవరి 25న ముస్కాన్.. ఆమె ప్రియుడు సాహిల్.. సౌరబ్‌ను చంపాలని ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. కానీ ఆరోజు ప్రయత్నం సక్సెస్ కాలేదన్నారు. మార్చి 4న మాత్రం ప్రణాళిక పక్కాగా అమలు చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్ పోసేశారన్నారు.
చేతబడి కోణంలో విచారణ
పోలీసులు ఈ కేసులో మరో ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఇందులో చేతబడి ఏదైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై మరింత దర్యాప్తు జరగాలని వెల్లడించారు.సాహిల్‌కు మంత్రతంత్రాలపై లోతైన నమ్మకం ఉందని.. అతను మూఢనమ్మకం ఉందని దర్యాప్తులో తేలిందన్నారు. ముస్కాన్‌కు ఈ విషయం బాగా తెలుసని.. అతడ్ని మోసగించేందుకు దీన్ని వాడుకుందని ఆరోపించారు. సాహిల్ తల్లి కొన్నేళ్ల క్రితం మరణించిందని.. అయితే, చనిపోయిన తల్లితో తాను మాట్లాడగలనని.. అతడు నమ్ముతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ అతను ఇప్పటికీ ఆమెతో కమ్యూనికేట్ చేయగలడని అతను నమ్మాడు. ముస్కాన్ తన సోదరుడి మొబైల్ నంబర్‌ను ఉపయోగించి మూడు నకిలీ స్నాప్‌చాట్ ఐడీలను సృష్టించిందన్నారు. ఆమె సాహిల్‌కు సందేశాలు పంపడానికి ఒక అకౌంట్ ని వాడిందని.. సాహిల్ తల్లి చనిపోయిన తర్వాత కూడా అతడితో మాట్లాడుతోందనే నమ్మకాన్ని కల్గించిందన్నారు. సాహిల్ గదిలో గోడలపై వింత చిత్రాలు, చేతబడికి సంబంధించిన చిహ్నాలు కన్పించాయని చెప్పుకొచ్చారు. హత్య తర్వాత సౌరభ్ తల, చేతులను సాహిల్ తన గదిలో ఉంచుకున్నాడని.. అది చేతబడి కోసమే కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.