- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Balakrishna: బెట్టింగ్ చిక్కుల్లో బాలకృష్ణ!.. అన్ స్టాపబుల్ షో లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. అల్లు ఫ్యామిలీకి మళ్లీ షాక్ తప్పదా?

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ (Betting Apps Case) వ్యవహారం దుమారం రేపుతున్నది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారన్న కారణంగా పలువులు టాలీవుడ్ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్లు, యాంకర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తుండగా తాజాగా ఈ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) పేరు తెరపైకి రావడం టాలీవుడ్ లో కలకలం రేపుతున్నది. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో (Unstoppable Show) బెట్టింగ్ యాప్ ప్రచారం చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఓ వైపు ఈ కేసును తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకోగా మరో వైపు టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా బెట్టింగ్ చిక్కుల్లో దొరికిపోతుండటం హాట్ టాపిక్ గా మారింది.
బాలయ్య షో చూసి రూ.80 లాస్:
ఆహా అనే ఓటీటీ యాప్ లో బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో లో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ ను చూసి దాన్ని డౌన్ లోడ్ చేసుకుని రూ.80 లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరుకు శ్రీరాంబాబు అనే బాధితుడు తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. దీంతో ఈ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అని నిరూపించేందుకు ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ లో బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారని ఇది నిజమే అనడానికి ప్రభాస్, గోపీచంద్ కు బాలయ్య ఇచ్చిన ప్రజెంటేషన్ పై ఫన్ 88 బెట్టింగ్ యాప్ పేరు ఉందని నెటిజన్లు అందుకు సంబంధించిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
అల్లు ఫ్యామిలీకి మళ్లీ షాక్ తప్పదా?:
బెట్టింగ్ వ్యవహారంలో అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ పేరు తెరపైకి రావడంతో మరోసారి అల్లు ఫ్యామిలీ పేరు తెరపైకి వస్తోంది. అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్న ఆహా ఓటీటీ యాప్ ( Aha Ott) టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కు (Allu Arvind) చెందిన గీతా ఆర్ట్స్, మై హోస్ జాయింట్ వెంచర్ యాజమాన్యంలో ఉంది. ఈ యాప్ అల్లు అర్జున్ కూతురు అర్హా పేరుతో అర్హా మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో నమోదై ఉండటం గమనార్హం. భవిష్యత్ లో విచారణలో భాగంగా తాను కేవలం ఆ కార్యక్రమానికి హోస్టును మాత్రమేనని బాలయ్య పోలీసులకు వివరణ ఇస్తే ఏం జరగబోతుంది? అటు ఇటు తిరిగి ఈ వ్యవహారంలో అల్లు అరవింద్ కు చిక్కులు తప్పవా అనే టాక్ వినిపిస్తోంది. పుష్పా-2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా గతేడాది సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మూహీ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు అయి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ వ్యవహరం అల్లు ఫ్యామిలీకి భారీ షాక్ కు గా మారింది. తాజాగా టాలీవుడ్ ను కుదిపేస్తున్న బెట్టింగ్ వ్యవహారంలో చివరాఖరికు మరోసారి అల్లు ప్యామిలీకి షాక్ తగులుతుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
లీగల్ ఫైట్ లో పై చేయి ఎవరిదో?:
తాజా పరిణామాలతో బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ లో లీగల్ అంశం తెరపైకి వస్తోంది. రమ్మీ యాప్ ను ప్రమోట్ చేశారని విజయ్ దేవరకొండపై పోలీసులు నమోదు చేసిన కేసుతో ఆయన టీమ్ స్పందిస్తూ రమ్మీ స్కీల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు తెలిపిందని, అన్ని అనుమతులు ఉన్న ఏ23 అనే సంస్థకు విజయ్ బ్రాండ్ కు విజయ్ అంబాసిడర్ గా పని చేశారు. ఆ కంపెనీతో ఒప్పందం గతేడాదే ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి ఒప్పందం లేదని పేర్కొంది. రమ్మీ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారన్న కారణంతో కేసు నమోదైన ప్రకాశ్ రాజ్ సైతం స్పందిస్తూ.. 2016లో ఓ గేమింగ్ యాప్ కు పబ్లిసిటీ చేశానని అయితే అది ఇల్లీగల్ అని కొన్ని నెలల తర్వాత తెలిసి ఆ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగానని ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా వారు తన పాత ప్రకటనోలతో ప్రచారం చేసుకోవడం గమనించి లీగల్ నోటీసులు కూడా పంపించానని చెప్పారు. అయితే ఈ కేసులో పోలీసులు (TG Police) న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై 2017 నుంచి బ్యాన్ ఉందని, తెలంగాణ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ పై 800 వరకు కేసులు నమోదు అయినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికాగోయల్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. మరో వైపు బెట్టింగ్ యాప్ కారణంగా మరణించిన వారి వివరాలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో అంతిమంగా లీగల్ ఫైట్ లో పోలీసులు పై చేయి సాధిస్తారా లేక యాప్స్ ప్రమోట్ చేసిన వారు కేసుల నుంచి తప్పించుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.
Read More..
ఊర్లో అవిలేక యువకులకు పిల్లను ఇవ్వడం లేదు.. నిండు అసెంబ్లీలో స్పీకర్ షాకింగ్ కామెంట్స్