- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాకు ముహూర్తం ఫిక్స్.. ఫుల్ ఖుషీలో అభిమానులు

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల సలార్, కల్కి వంటి సినిమాలతో వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తీరిక లేకుండా దాదాపు ఓ 10 భారీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు. సలార్-2(Salar-2), కల్కి-2, ఫౌజి, స్పిరిట్(Spirit) సినిమాలతో పాటు హను రాఘవపూడి(Hanu Raghavapudi)తో ఓ మూవీ చేస్తున్నారు. అయితే అందరి చూపు సందీప్ రెడ్డి(Sandeep Reddy) వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ పైనే ఉన్నాయి. ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దానికి కారణం ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు కాబట్టి అంతా ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కానప్పటికీ ‘స్పిరిట్’ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, స్పిరిట్‌కు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ పూజా కార్యక్రమంతో ఉగాదికి ప్రారంభం కానున్నట్లు సమాచారం. అలాగే దీని స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అంటే వచ్చే నెల మొదటి వారంలో ‘స్పిరిట్’ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read More..