భూ భారతి ఆవిష్కరణకు డేట్ ఫిక్స్.. కొత్త పోర్టల్‌ని ఎవరు ప్రారంభించనున్నారంటే..?

by Bhoopathi Nagaiah |
భూ భారతి ఆవిష్కరణకు డేట్ ఫిక్స్.. కొత్త పోర్టల్‌ని ఎవరు ప్రారంభించనున్నారంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భూ భారతి(రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్) యాక్ట్, 2025 ఆవిష్కరణకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భూ భారతి చట్టం ప్రొవిజన్స్‌తో కొత్త పోర్టల్‌ని ప్రారంభించనున్నారు. రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ జయంతి రోజునే సామాన్య రైతులకు మేలైన సేవలందించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. శిల్ప కళావేదికలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్లను సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఆదేశించారు.



Next Story

Most Viewed