ఆ పార్టీ జెండాతో ఫొటోలకు ఫోజులిచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. జనసైనికుల రియాక్షన్ వైరల్

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-21 10:08:20.0  )
ఆ పార్టీ జెండాతో ఫొటోలకు ఫోజులిచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. జనసైనికుల రియాక్షన్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఏళ్లుగా జనసైనికులు ఎదురుచూస్తున్న కల నెరవేరింది. మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీ(Jana Sena Party) జెండాతో ఫొటోలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) లండన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని(Lifetime Achievement Award) ఆయనకు యూకే ప్రభుత్వం ప్రదానం చేసింది. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌(UK Parliament)లో ఘనంగా సత్కరించింది. సత్కారం అనంతరం పలువురు అభిమానులను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఈ సందర్భంగా వారికి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఈ సందర్భంలోనే విదేశాల్లో స్థిరపడిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు కూడా మెగాస్టార్‌తో ఫొటోలు దిగారు. ఏకంగా జనసేన జెండా పట్టుకొని దిగారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవి కాస్త వైరల్‌గా మారాయి. దీంతో తాము ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చిందని.. తమ కల నెరవేరిందని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


కాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections)ల్లో మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీ(Jana Sena Party)కి, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు టీడీపీ(TDP), బీజేపీ(BJP) ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆయన మద్దతిచ్చిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా గెలుపొందారు. అంతేకాదు.. ఇటీవలే నాటి ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది జనసేనగా మారిందని ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా తెగ వైరల్ అయ్యాయి.


Read More..

Balakrishna: బెట్టింగ్ చిక్కుల్లో బాలకృష్ణ!.. అన్ స్టాపబుల్ షో లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. అల్లు ఫ్యామిలీకి మ...

Advertisement
Next Story

Most Viewed