- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
NASA: కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్.. స్పేస్ నుంచి తిరుగుపయనం!

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) రాకా కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఆమె భూమి మీదకు చేరుకోనున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. అమెరికా సమయం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 గంటలకు వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నట్లు నాసా (NASA) వర్గాలు ప్రకటించాయి. కొన్ని గంటల్లో స్పేస్ సెంటర్ నుంచి సునీత విలియమ్స్ తిరుగుపయనం ప్రారంభం కానుందని, (Crew-9) క్రూ-9 రిటర్న్ కానుందని నాసా వెల్లడించాయి. ఈ మేరకు నాసా తాజాగా వారి ఫోటోలను విడుదల చేసింది. కాగా, వారిని తీసుకొచ్చేందుకు డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అమెరికా, జపాన్, రష్యాకు చెందిన నలుగురు వ్యోమగాములు అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ ఐఎస్ఎస్‌కు పంపించిన విషయం తెలిసిందే.
.Read More..
వారంలో మానాల్సిన గాయం.. కేవలం 4 గంటల్లో మానేలా జెల్! శాస్త్రవేత్తల అద్భుత సృష్టి