- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎల్ఆర్ఎస్ చెల్లింపులను ఏప్రిల్ నెల వరకు పొడిగించాలి.. తూడి మేఘారెడ్డి..

దిశ, వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరి ఆయకట్టు వరకు నీరందించేలా వేసవిలో సాగునీటి కాలువలను దురస్తుకు చర్యలు చేపట్టాలని తూడి మేఘారెడ్డి కోరారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి శనివారం శాసనసభలో మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగింపు నెల కావడంతో ప్రజల ఆదాయపన్ను ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎల్ఆర్ఎస్ చెల్లింపులను ఏప్రిల్ నెల వరకు పొడిగించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లాలో ప్రాథమిక రైతు సహకార సంఘాలలో, గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటి పన్ను ఆస్తి పన్ను(OTS)వన్ టైం సెటిల్మెంట్ విధానంను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు అన్ని మున్సిపాలిటీలకు కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రానున్న వానాకాలంలో డీ8, డీ5, బుద్ధారం కుడి ఎడమ కాలువలలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు కాలువలలో పేరుకుపోయిన ఒండ్రును, జమ్మును తొలగిస్తూ కాలువల దురస్తుకు చర్యలు చేపట్టాలని కోరారు. నియోజకవర్గంలోని పెబ్బేరు మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా మారుస్తూ మరికొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డుకు, పెద్దగూడెం ఖాన్ చెరువు కాలువల నిర్మాణాలకు సంబంధించి అటవీశాఖ అనుమతుల సమస్య ఉందని సమస్యను వెంటనే పరిష్కరించాలనీ ఎమ్మెల్యే కోరారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వసతి గృహాలు కళాశాలలు అద్దె భవనాల్లో ఉన్నాయని వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలన్నారు.