పదో తరగతి పరీక్షల వేళ తీవ్ర విషాదం.. ఆర్టీసీ బస్సు కింద పడి 10వ తరగతి విద్యార్థిని మృతి

by Kalyani |   ( Updated:2025-03-22 09:33:21.0  )
పదో తరగతి పరీక్షల వేళ తీవ్ర విషాదం.. ఆర్టీసీ బస్సు కింద పడి 10వ తరగతి విద్యార్థిని మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు చక్రాల కింద పడి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని మృతి చెందగా, ఆమె అన్నకు తీవ్ర గాయాలు అయిన ఘటన శనివారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీకి చెందిన ప్రభాతి ఛత్రియ (16) టెలికాం నగర్ లో 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. శుక్రవారం మొదటి పరీక్ష రాసిన ఆమె రెండవ రోజైన శనివారం తన అన్న సుమన్ ఛత్రియ బైక్ పై పరీక్షకు వెళ్లింది. పరీక్ష పూర్తయిన అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఆర్టీసీ డబల్ డెక్కర్ బస్సు చక్రాల కింద పడింది. ఈ ఘటనలో బైక్ పై వెనుక కూర్చున్న ప్రభాతి ఛత్రియ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె అన్న సుమన్ ఛత్రియాకు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ తో గచ్చిబౌలి లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Next Story

Most Viewed