- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)కు మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు (Supreme Court Notices) జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గతంలో ఇచ్చిన నోటీసులపై ఎటువంటి స్పందన రాకపోవడంతో మరోసారి ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS party) నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు (10 MLAs) కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ఇదే కేసులో గత విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పిటిషన్ పై ఈ నెల 22లోగా స్పందించాలని నోటీసులు ఇవ్వగా.. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది.