- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాజీ మంత్రి విడదల రజిని రాజకీయ ప్రస్థానంలో అన్ని వివాదాలు

దిశ, పల్నాడు : మాజీ మంత్రి, విడదల రజిని ప్రస్తుత పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తొలి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమె ప్రస్తానాన్ని చూస్తే.. అంతా వివాదాలమయంగానే ఉంటుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కాకుండా, జిల్లా స్థాయిలో కొందరితో ఆమె రాజకీయ శతృత్వం ఏర్పరుచుకుందున్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
వివాదాలమయం..
ఆ నాటి వైసీపీ ఎంపీ, ప్రస్తుతం టీడీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలుతో ఆది నుంచి రజనీతో ఘర్షణ పూరిత వాతావరణం ఉందని నిన్నటి పరిణామాలు తేటతెల్లం చేశాయి. ఎమ్మెల్యేగా తన విజయంలో కీలక పాత్ర పోషించిన వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌తో కూడా ఆమె సఖ్యతగా ఉండలేకపోయారు. ఎన్నికల వరకు బాబాయ్ అంటూ మర్రితో ఉండి ఎమ్మెల్యే పదవిలోకి రాగానే రజని యూ టర్న్ ఎందుకు తీసుకుంది?, ఘర్షణ పూరిత వాతావరణం వచ్చిందో పార్టీ వర్గాలు కూడా అంచనా వేయలేక పోయాయి.
సోమేపల్లి సాంబయ్య అల్లుడిగా, ఎమ్మెల్యేగా 20 ఏళ్ల పాటు అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్, వైసీపీ జెండాను మోసి నియోజకవర్గంలో క్యాడర్ ను కాపాడిన మర్రితో రజనీ రాజకీయ వైరం పెట్టుకోవటం ఆమె రాజకీయ పరిణితిని చిలకలూరిపేట లో రాజకీయ సీనియర్లు అప్పట్లోనే పసిగట్టారు. ఇది ప్రధానంగా విడదల రజని రాజకీయ తప్పిదంగా ఆ పార్టీ వారే భావిస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇద్దరు తొట్టి గ్యాంగ్ జర్నలిస్టులు, ఆమెకు దగ్గరై వివాదాల రాజకీయ నాయకురాలిగా చర్చించుకునే దుస్థితికి కారణమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను కూడా రజనీ దూరం చేసుకున్నారని రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయం.
శాఖపైనా పట్టు సాధించని వైనం..
చిలకలూరిపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన విడుదల రజనీకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రిగా అవకాశాన్ని కల్పించారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ అప్పగించారు. ఆమె మంత్రిగా శాఖ పై పట్టు సాధించలేక పోయారని నాటి అధికార, రాజకీయ వర్గాల్లో అభిప్రాయం ఉండేది. నియోజక వర్గంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ, ఎక్కువశాతం వివాదాలపైన దృష్టి కేంద్రీకరిస్తున్నట్లుగా ప్రచారం ఉండేది.
అప్పుడే ఫోన్ ట్యాపింగ్ వివాదం..
నాటి, నేటి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రజనీతో అప్పట్లోనే ఘర్షణ మొదలైందని తాజా మీడియా సమావేశాల్లో తేలిపోయింది. ఒకానొక సమయంలో గత ప్రభుత్వంలో ఎంపీ కృష్ణదేవరాయలు అనుచరులపై కూడా దాడులు జరిగాయి. చిరుమామిళ్లలో చనిపొయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీని, రజనీ ముఖ్య అనుచరులు తీవ్రంగా అవమానించారు. అంటే చిలకలూరిపేటలో ఎంపీ తిరగకూడదన్నట్టు ఆమె రాజకీయం నడిపారని, కృష్ణదేవరాయలు అనుచరులు చెప్పుకొస్తున్నారు.
ఎన్నికల సమయంలోనూ..
ఎన్నికల సమయంలో రజనీ గుంటూరుకు మారిన తర్వాత, ఆమె సూచించిన మల్లెల రాజేష్ నాయుడుకు వైసీపీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పజెప్పారు. ఆ సమయంలో మర్రి రాజశేఖర్‌ను ఆయన కలవడం ఇష్టం లేక, కావటి మనోహర్ నాయుడును రంగంలోకి దింపారు. దీంతో రాజేష్ నాయుడు తన అనుచరులతో టీడీపీలో చేరి పోయారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, రజనీ తన పీఏలను అడ్డం పెట్టుకొని భారీగా వసూళ్లు భారీగా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ అవినీతి ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. త్వరలో అరెస్టు లు జరుగుతాయని ప్రచారం జరుగుతుంది.
రాయబారం.. దుమారం..
కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎదుర్కొంటానని రజనీ చెబుతూనే, ఎంపీ కృష్ణదేవరాయల వద్దకు రాయబారం పంపిందన్న వార్తలు వైసీపీలోనే దుమారం రేపాయి. ఈ క్రమంలో ఆమె గురించి కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికైనా రాజకీయ వైఖరి మార్చుకుంటే చిలకలూరిపేటలో వైసీపీ మనుగడ ఉంటుందని లేకుంటే కష్టమేనని స్థాయిలో రజనీ పూర్తి స్థాయిలో వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు.