- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నెట్టింట్లో గున్న ఏనుగు వంట చేస్తున్న వీడియో వైరల్.. ఇంతకీ ఆ వంట ఏంటో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: ఆకారంలోనూ, బలంలోనూ అత్యంత బలమైన జంతువు ఏనుగు (Elephant). అలాగే, మిగతా జంతువులతో పోల్చితే ఏనుగులకు అపారమైన తెలివి తేటలు కూడా ఉంటాయి. తమ సమస్యలను పరిష్కరించటంలో, భావోద్వేగాలను అర్థం చేసుకోవటంలో చాలా స్మార్ట్‌గా (Smart) బిహేవ్ చేస్తాయి. అంతేకాదు, మనుషులు ఒక్కసారి ఏదైనా నేర్పిస్తే అవి వెంటనే నేర్చేసుకుంటాయి కూడా. సోషల్ మీడియాలో (Social media) ఏనుగులకు సంబంధించి ఇలాంటి అనేక వీడియోలు నిత్యం వైరల్ అవ్వటం చూస్తుంటాం. అవి చేసే అల్లరి పనులు, వింత వింత చేష్టలు చూసి నెటిజన్లను హాయిగా నవ్వుకుంటుంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏనుగు ఏం చేసిందో మీరు కూడా చూసేయండి.
ఈ వీడియోలో ఓ గున్న ఏనుగు నేలపై కూర్చొని కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కనిపించింది. పక్కన ఓ మహిళ నిల్చుని ఆ ఏనుగుకు వంట చేయటం నేర్పిస్తుండటం కూడా చూడొచ్చు. మాస్టర్ చెఫ్ మాదిరిగా చాలా ప్రొఫెషనల్‌గా ఆ గున్న ఏనుగు తొండెంతో గరిటె పట్టుకుని కలియబెడుతుంది. అనంతరం ఆ మహిళ రోలులో మసాలా దినుసులు దంచటం చూపించగా, వెంటనే ఏనుగు అలాగే వాటిని మెత్తగా దంచింది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో థాయిలాండ్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు గున్న ఏనుగు తెలివి తేటలను ప్రశంసిస్తున్నారు. ఈ ఏనుగు త్వరలోనే మంచి హోటల్‌లో చెఫ్‌గా మారే అవకాశం ఉందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.