తెలంగాణ బీజేపీ ఎంపీకి CM రేవంత్ శుభాకాంక్షలు

by Gantepaka Srikanth |
తెలంగాణ బీజేపీ ఎంపీకి CM రేవంత్ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తనదైన ముద్ర వేస్తు్న్నారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఎంపీలకు బర్త్ విషెస్ చెబుతున్నారు. తాజాగా పుట్టినరోజు వేళ తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao)కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘మెదక్ లోక్‌సభ(Medak Lok Sabha) సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.

కాగా, గత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ దుబ్బాక పార్లమెంట్ సెగ్మెంట్(Parliament Segment) నుంచి పోటీ చేసి గెలుపొందారు.

Advertisement
Next Story

Most Viewed