Viral video: సాహసం అంటే ఇది.. వీల్‌ఛైర్‌లో వచ్చి విల్ పవర్ చూపించాడు!

by D.Reddy |
Viral video: సాహసం అంటే ఇది.. వీల్‌ఛైర్‌లో వచ్చి విల్ పవర్ చూపించాడు!
X

దిశ, వెబ్ డెస్క్: బంగీ జంపింగ్ (Bungee jumping) గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. శరీరానికి తాళ్లు కట్టుకుని తలకిందులుగా ఎత్తైన శిఖరం, బిల్డింగ్, బ్రిడ్జిపై నుంచి దూకే సాహస క్రీడ. అద్భుతమైన ఫీలింగ్ ఇచ్చి ఈ సాహసాన్ని ఆస్వాదించేందుకు నేటి తరం యువత ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే, దీన్ని చేయటం అంత తేలిక కాదు. శారీరక, మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండాలి. అలాంటిది ఓ వ్యక్తి వీల్ చైర్‌తో (Wheelchair) పాటు బంగీ జంపింగ్ చేసి.. సంకల్పానికి అంగవైకల్యం కూడా తలవంచాల్సిందే అని నిరూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Adani Group Chairman Gautam Adani) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.

అదానీ గ్రూప్‌లో పనిచేస్తున్న మెహతా అనే ఉద్యోగి రిషికేశ్‌లో బంగీ జంప్ చేసిన వీడియోను గౌతమ్ అదానీ పంచుకున్నారు. అయితే, మెహతా వీల్ చైర్‌తో సహా బంగీ జంప్ చేసి అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఇక ఈ వీడియోకు అదానీ.. 'చాలామంది దీనిని థ్రిల్‌ కోసం చేస్తారు. కానీ మన మెహతా సంకల్ప శక్తి పవర్‌ చూపించడానికి ఈ సాహసం చేశారు. అయినా సంకల్ప శక్తి ముందు ఏ భయం, వైకల్యం అయినా పరార్‌ అయిపోవాల్సింది' అనే క్యాప్షన్ కూడా జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అతడి వీల్ పవర్‌కు సెల్యూట్, ఇది ఎంతో మందికి ఆదర్శనీయం అంటూ మెహతాను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Next Story