- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సుధీర్ రెడ్డిని రాజకీయ సమాధి చేస్తాం : బెల్లయ్య నాయక్

దిశ, చైతన్య పురి : అహంకారంతో గిరిజన మహిళా కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ ట్రైబల్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు. శనివారం బానోతు సుజాత నాయక్ నివాసానికి వచ్చిన ఆయన ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం పై ప్రమాణం చేసిన ఎమ్మెల్యే మహిళల పట్ల ఇంత చులకన భావం తో, వివక్ష పూరితంగా మాట్లాడడం దుర్మార్గమన్నారు. గిరిజన మహిళ అంటే ఇంత చులకన భావమా అని ప్రశ్నించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ విలువలను పాటించని వ్యక్తికి ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదన్నారు. ఇక ఊరుకునే ప్రసక్తే లేదని సుధీర్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయడం తప్పదన్నారు.
ఏ రాజకీయ పదవికి అర్హుడు కాకుండా చేస్తామని, “గిరిజన బిడ్డను అవమానించావు. దీన్ని మేము భరించడం లేదు నువ్వు మాట్లాడిన విషయాలపై మీ కుటుంబ సభ్యులను అడుగు మహిళల గొప్పతనం, గౌరవం ఏంటో కనీసం వారి నుంచైనా తెలుసుకో” అని హితవు పలికారు. కుల దురహంకారం తో మాట్లాడిన ఎమ్మెల్యే పై చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. సుజాత నాయక్ కి జరిగిన అవమానంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఈ విషయంపై సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు. సుజాత నాయక్ కు న్యాయం జరిగేంత వరకు సుధీర్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణ, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, దుర్గారెడ్డి, రాజేశ్వరి, అనసూయ, లతా గౌడ్, కవిత, భాను, మణి శ్రీ, జంగయ్య యాదవ్, తోకటి కిరణ్, సీతారాం, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.