సీనియర్ నటుడు, పవన్‌ కల్యాణ్‌ గురువు కన్నుమూత

by D.Reddy |
సీనియర్ నటుడు, పవన్‌ కల్యాణ్‌ గురువు కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కోలీవుడ్‌ నటుడు, పవన్ కళ్యాణ్ గురువు షిహాన్‌ హుసైని(60) (Shihan Hussaini) కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చైన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కు హుసైని మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే, కిక్‌ బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు.

ఇక షిహాన్‌ హుసైని 1986లో విడుదలైన 'పున్నగై మన్నన్‌' చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు విజయ్‌ హీరోగా నటించిన బద్రి మంచి గుర్తింపునిచ్చింది. ఆర్చరీలోనూ శిక్షకుడిగా ఉన్న ఆయన ఆ రంగంలో 400 మందికి పైగా విద్యార్థులను తయారు చేశారు. హుసైని మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.


Advertisement
Next Story