- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సన్నబియ్యం మాత్రమే పంపిణీ చేయాలి
by Naveena |

X
దిశ,దేవరకద్ర: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ నెల 30 తేదీ నుంచి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తారని తహసిల్దార్ కృష్ణయ్య అన్నారు. శుక్రవారం దేవరకద్ర తహసిల్దార్ కార్యాలయంలో డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కార్డుదారులకు సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని, ఎలాంటి అవకతవకలకు పాల్పడకూడదని సూచించారు. సన్న బియ్యాన్ని ప్రతి వినియోగదారునికి అందించాలని తెలిపారు. ప్రతి డీలరు చౌక ధర దుకాణాల దగ్గర దుకాణం పేరుతో ఉన్నబోర్డు, స్టాక్ రిజిస్టర్,ధరల పట్టిక మెయింటెనెన్స్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ దీపిక, ఆర్ ఐ శరత్, రేషన్ డీలర్లు బాలస్వామి, ఈశ్వరయ్య, బుచ్చన్న, ఆంజనేయులు , రాములు, భీమ్ రెడ్డి, మాధవరెడ్డి,జగదీష్,రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story