- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Samantha: నా దృష్టిలో సక్సెస్ అంటే అదే.. సమంత కీలక వ్యాఖ్యలు

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరగా ఈ అమ్మడు ‘ఖుషి’ మూవీలో నటించింది. ఆ తర్వాత ‘సీటాడెల్ హనీ బన్నీ’(Citadel: Honey Bunny) వెబ్‌సిరీస్ చేసిన ఈ బామ ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ (Rakt Bramhand)అనే యాక్షన్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే పలు కారణాల వల్ల దీనికి సంబంధించిన షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నా దృష్టిలో సక్సెస్ అంటే స్వేచ్ఛ, స్వతంత్రం.
నేను విజయవంతమయ్యాయని ఇతరులు చెప్పే వరకు వెయిట్ చేయను. సక్సెస్ అంటే మనకు నచ్చినట్లు జీవించడం అలాగే మన అభిరుచికి తగ్గట్టుగా పనులు చేయడమే. అంతేకానీ మహిళలను ఒకచోట బంధించి ఇది చేయాలి? అది చేయకూడదు అని రూల్స్ పెట్టడం కాదు. నిజ జీవితంలో ఎన్నో రకాల పాత్రలను పోషిస్తే అన్నింటిలో సమర్థంగా రాణించగలగడమే సక్సెస్ అనుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత ఆస్ట్రేలియాకు వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ నేచర్, యానిమల్స్‌ను చూసి ఎంజాయ్ చేస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.