- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామ సమీపంలోని ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన ఏడు మంది కోసం జరుగుతున్న సహాయక చర్యల్లో 32వ రోజున మరో మృతదేహం లభించడంతో పురోగతి కనిపిస్తున్నది. మినీ హిటాచితో మట్టి ఇతర శఖలాలు తొలగిస్తున్న క్రమంలో కన్వేయర్ బెల్ట్‌కు సుమారు 50 మీటర్ల దూరంలో మృతదేహం కనిపించినట్లు తెలుస్తుంది.
ఆ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా గడచిన 32 రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో సుమారు 700 మంది ఆపరేషన్ నిర్వహిస్తూ వారికోసం కొనసాగిస్తున్న అన్వేషణ ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యంకాగా..మరో ఆరుగురి కోసం సొరంగంలో తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయంపై ఆ మృతదేహం ఎవరిది అనేది గుర్తించి అధికారుల నిర్ధారిస్తూ ప్రకటన చేయాల్సి ఉంది.