- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
iPhone Charging Port: వైర్‌లెస్ ఛార్జింగ్.. జీరో పోర్ట్స్.. ఐఫోన్ నుంచి అదిరే అప్‌డేట్!

దిశ, వెబ్ డెస్క్: iPhone Charging Port: ఆపిల్ కంపెనీ తన స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. రాబోయే ఐఫోన్ మోడళ్లలో కీలక మార్పులను చూడవచ్చు. బ్లూమ్ బెర్గ్ కు చెందిన మార్క్ గుర్మాన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆపిల్ పూర్తిగా పోర్ట్ రహిత ఐఫోన్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అలాగే ఛార్జింగ్ పోర్ట్ లేకుండా కంపెనీ ఐఫోన్ 17 ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అంటే కంపెనీ భవిష్యత్ డిజైన్ పై పనిచేస్తోంది. రాబోయే కొత్త ఐఫోన్ ను పోర్ట్ లేకుండా అందించాలని యోచిస్తోంది. గత కొన్నేళ్లుగా ఆపిల్ పోర్ట్ లెస్ ఐఫోన్ ను తయారు చేయాలని ఆలోచిస్తున్నప్పటికీ ఇప్పుడు కంపెనీ నెమ్మదిగా వైర్ లెస్ ఎకోసిస్టమ్ వైపు కదులుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో మాగ్ సేఫ్ ఛార్జింగ్ ను కొనసాగించడం, వైర్ లెస్ డేటా ట్రాన్స్ ఫర్ స్పీడ్ ను మెరుగుపరచడం వంటి పనులు కూడా ఉన్నాయి. బ్లూమ్ బెర్గ్ రిపోర్టు ప్రకారం ఐఫోన్ 17 ఎయిర్ సక్సెస్ అయితే భవిష్యత్తులో పూర్తిగా పోర్ట్ రహిత మోడల్స్ ను లాంచ్ చేయడంపై కంపెనీ ఫోకస్ పెడుతుందని ఆపిల్ అధికారులు చెబుతున్నారు
కాగా ఆ కంపెనీ గతంలో ఐఫోన్ 7లో హెడ్ ఫోన్ జాక్ ను తీసేసి, ఫ్లాగ్ షిప్ మోడల్లో టచ్ ఐడికి బదులుగా ఫేస్ ఐడిని జోడించడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ కంపెనీ ఛార్జింగ్ పోర్టును తొలగించడానికి కదులుతోంది. ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పోర్ట్ లేకుండా ఫోన్లోకి వాటర్, డస్ట్ ప్రవేశించడానికి రంధ్రం ఉండదు. పోర్ట్ లెస్ ఐఫోన్ బెనిఫిట్స్ ఏంటంటే అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. వైర్డు డేటా బదిలీపై ఆధారపడే వారికి ముఖ్యంగా హై రిజల్యూషన్ వీడియోలు షూట్ చేసేవారికి ఇది ఒక సవాలుగా ఉంటుంది. అలాంటి వారికి పెద్ద ఫైళ్లను వైర్ లెస్ గా బదిలీ చేయడం కష్టంగా మారే ఛాన్స్ ఉంది.
కాగా ఈ బోల్డ్ కాన్సెప్ట్ అనేది రాబోయే ఐఫోన్ 17 ఎయిర్ కోసమని తెలిపింది. ఇది దాదాపు 2ఎం,ఎం సన్నగా ఉంటుంది. 6.6 అంగుళాల డిస్ల్పేను కలిగి ఉంటుంది. అయితే ఈయూ యూఎస్బి సి అవసరాల కారణంగా దీనిని పక్కన పెట్టే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మనం ఇంకా పోర్ట్ లెస్ ఐఫోన్ ను చూసే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త ఐఫోన్ సిరీస్ ను సెప్టెంబర్ -అక్టోబర్ నెలలో లాంచ్ చేయవచ్చు. ఈ సారి ఈ సిరీస్ లో పెద్ద మార్పు ఉంటుంది. ఈ సిరీస్ లో ప్లస్ మోడల్కు బదులుగా ఐఫోన్ 17 ఎయిర్ ను ఆవిష్కరించనున్నారు. ఈ ఫోన్ లాంచ్ చేయడానికి చాలా సమయం ఉంది. కానీ మార్కెట్లో మాత్రం దానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం కంపెనీ ధర గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ వెలువడుతున్న లీకులను బట్టి చూస్తే దాని ప్రారంభ ధర దాదాపు రూ. 90,000 ఉండవచ్చు.