పది పరీక్షలు పకడ్బందీగానే జరుగుతున్నాయా...?

by Kalyani |
పది పరీక్షలు పకడ్బందీగానే జరుగుతున్నాయా...?
X

దిశ,మణుగూరు/పినపాక : ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంబంధించిన అధికారులతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రతి కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేసింది. అధికారులు కూడా విద్యార్థుల హాల్‌ టికెట్లు, వసతులు, అన్ని విధులుగా చెక్ చేసి విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి పంపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పినపాక సెంటర్స్ లో పది పరీక్షలు పకడ్బందీగానే జరుగుతున్నాయా..? అంటే జరగడం లేదనే పబ్లిక్ టాక్ జోరుగానే వినపడుతుంది. పినపాకలో ఉన్న కొన్ని ప్రైవేట్ విద్య సంస్థలు ఎగ్జామ్ సెంటర్స్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకొని మాస్ కాపీకి..? పాల్పడుతున్నారనే చర్చనే జోరుగా వినపడుతోంది. సంబంధించిన కొంతమంది అధికారులకు ముడుపులు ఆశచూపి పరీక్షా ప్రారంభమైన దాదాపు 30 నుంచి 40 నిమిషాలలో పరీక్షా పేపర్ బయటకు వచ్చేలా చేస్తున్నారని పినపాక ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో ఆ విద్య సంస్థలు తమ అనుకున్న విద్యార్థులకు మాస్ కాపీ చేపించి 10 గ్రేడ్ పాయింట్స్ పొందుతున్నారనే విమర్శలు కూడా వినబడుతున్నాయి.

ప్రతి ఏడాది నియోజకవర్గంలో ఏ విద్యా సంస్థకు రాని 10 గ్రేడ్ పాయింట్స్ ఆ స్కూల్స్ కే ఎలా వస్తున్నాయని పినపాక సెంటర్స్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. అంతేగాక తమ విద్యా సంస్థలకు ఉత్తమ ఫలితాల రావాలని ఉద్దేశంతో మణుగూరులోని కొంతమంది విద్యార్థులను పినపాకలో ఉన్న తమ బ్రాంచ్ ల నుండి ఎగ్సామ్ ఫీజు కట్టించడం కూడా జరిగిందని పలువురు చర్చించుకుంటున్నారు. దీంతో పినపాకలో మాస్ కాపీకి పాల్పడి అక్కడి ఫలితాలను మణుగూరులో ప్రచారం చేస్తున్నారని విమర్శలు జోరుగా వినపడుతున్నాయి. తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలవేలకు ఫీజులు కట్టించుకొని మాస్ కాపీకి ప్రోత్సాహస్తున్నరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారి పట్టించుకోని, ఎగ్జామ్ సెంటర్స్ లలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను లోపలి రానివ్వకుండా చూడాలని, పరీక్షా కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పినపాక విద్యాశాఖ అధికారి వివరణలో ఏం చెప్పారంటే...

పినపాక సెంటర్స్ లలో పది పరీక్షలు పకడ్బందీగానే జరుగుతున్నాయని తెలిపారు. ఎగ్జామ్ సెంటర్స్ లో మాస్ కాపీలు అలాంటివి ఏం జరగడం లేదని తెలిపారు. 30 నుంచి 40 నిమిషాలలో పరీక్షా పేపర్ బయటకు రావడం అనేది అసంభవం అని తెలిపారు. మణుగూరులో ఉన్న కొంతమంది విద్యార్థులను పినపాక తమ బ్రాంచ్ ల వద్ద ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవడం లేకపోలేదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పోలీస్ బందోబస్త్ కూడా భారీగా ఏర్పాటు చేశామన్నారు. పినపాకలో 2 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయని, 23 మంది ఇన్విజిలేటర్లు, 2 మంది చీఫ్‌ సూపరింటెండెంట్స్‌, 2 మంది డిపార్ట్‌ మెంటల్‌ ఆఫీసర్స్‌ ఉన్నారని తెలిపారు. మాస్ కాపీ అనే విషయం మా దృష్టికి రాలేదని, సోమవారం నుంచి ఎగ్జామ్ సెంటర్స్ ను మరింత పకడ్బందీగా చేస్తామని తెలిపారు.

-- పినపాక విద్యాశాఖ అధికారి,ఎగ్జామ్ సెంటర్స్ నాగయ్య.

Next Story

Most Viewed