- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐశ్వర్య రాయ్ నుంచి నాకు ఫోన్ వస్తే ఒత్తిడికి గురవుతా.. అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) అందరికీ సుపరిచితమే. తన తేనె కళ్లతో 1994 సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికై అందరినీ మంత్ర ముగ్దులను చేసింది. ఎన్నో యాడ్స్ చేసిన ఆమె నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి పరిచయం అయి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ‘ఇరువార్’(Iruvar) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. చివరగా ఐశ్వర్య రాయ్ పొన్నియన్ సెల్వన్-1, పొన్నియన్ సెల్వన్-2 చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇక ఐశ్వర్య రాయ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు కెరీర్ పీక్స్‌లో ఉండగానే అభిషేక్ బచ్చన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నరనే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ జంట మాత్రం అధికారికంగా స్పందించకపోవడంతో నిత్యం వీరి విడాకుల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అభిషేక్(Abhishek Bachchan) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నా భార్య ఐశ్వర్య రాయ్ నుంచి నాకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అన్నప్పుడు నేను ఒత్తిడికి గురవుతాను. ప్రత్యేకంగా మాట్లాడాలని ఫోన్ చేసిందంటే ఖచ్చితంగా మనం సమస్యలో ఇరుక్కున్నట్లే లెక్క’’ అని చెప్పుకొచ్చారు.