పోలీసులను చూసి పారిపోతూ అడ్డంగా దొరికిన గంజాయి విక్రేత

by Sridhar Babu |
పోలీసులను చూసి పారిపోతూ అడ్డంగా దొరికిన గంజాయి విక్రేత
X

దిశ, మెట్ పల్లి / ఇబ్రహీంపట్నం : గంజాయి అమ్ముతూ యువకుడు పట్టుబడిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్ది తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన పోగుల అజయ్ (23) నిజామాబాద్ వైపు నుండి మెట్ పల్లి వైపు వస్తూ ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామం వెంకటేశ్వర ఆలయం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నది గమనించి పోలీసులను చూసి పారిపోయే క్రమంలో అలర్ట్ అయిన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్ద 300 గ్రాముల గంజాయి (విలువ 15వేలు), ఒక ద్విచక్ర వాహనం, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అజయ్ పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Next Story