- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంట్లో తయారుచేసే పానీయాలకు ఎంత చక్కెర వాడితే హెల్తీగా ఉంటారు?

దిశ, వెబ్‌డెస్క్: మన ఆహారంలో అధిక చక్కెర(Sugar)ను జోడించడం వల్ల బరువు పెరగడం, మధుమేహం(diabetes), గుండె సమస్యలు వంటివి దారితీస్తాయి. WHO ప్రకారం రోజువారీ కేలరీలలో 10% కంటే తక్కువ జోడించిన చక్కెరను పరిమితం చేయాలని సలహా ఇచ్చింది. మరీ ఇంట్లో తయారుచేసే పానీయాలకు ఎంత చక్కెర వాడితే హెల్తీగా ఉంటారో తాజాగా నిపుణులు వెల్లడించారు. చాలా ఆహార పదార్థాల్లో చక్కెరను వాడుతుంటారు. షుగర్ రుచిని పెంచడంలో మేలు చేస్తుంది.
NHS UK రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోకూడదని సలహా ఇచ్చింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (American Heart Association) మహిళలకు రోజుకు 25 గ్రాముల (సుమారు 6 టీస్పూన్లు) పురుషులకు రోజుకు 36 గ్రాముల (సుమారు 9 టీస్పూన్లు) అదనపు చక్కెర తీసుకోవడం పరిమితం చేయాలని వెల్లడించింది. రుచికి హాని కలిగించకుండా.. ఆరోగ్యంపై భారం పడకుండా ఇంట్లో తయారుచేసిన పానీయాలను ఎంత చక్కెర వాడాలో.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఒక సాధారణ కప్పు చాయ్ లేదా కాఫీలో తరచుగా 1 నుంచి 2 టీస్పూన్ల చక్కెర ఉపయోగిస్తుంటాం. కానీ రోజులో ఎక్కువసార్లు టీ తాగేవారు అయితే.. చక్కెరను క్రమంగా తగ్గించి, బెల్లం, తేనె వంటివి జోడించడానికి ప్రయత్నించండి. ఒక కప్పుకు 1 టీస్పూన్ (4 గ్రా)ఉండేలా చూసుకోండి. ఒకవేళ రాత్రి టీ, కాఫీ తాగితే షుగర్ వేయకపోవడమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంట్లో తయారుచేసిన జ్యూస్‌లు (Juices), స్మూతీలు (Smoothies), మిల్క్‌షేక్‌ల (Milkshakes)కు ఎంత చక్కెర జోడించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పండ్లలో ఇప్పటికే సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి అదనపు చక్కెరను జోడించడం అనవసరం. సహజ తీపికి కట్టుబడి ఉండండి. మీరు చక్కెరను జోడించాల్సి వస్తే, దానిని గ్లాసుకు 1 టీస్పూన్‌కు పరిమితం చేయండి. బదులుగా రుచులను సమతుల్యం చేయడానికి తీపి, ఉప్పగా ఉండే పండ్లను కలిపి తీసుకోండి.
అలాగే బ్లెండెడ్ ఫ్రూట్స్(Blended fruits)కు చక్కెరను జోడించడం వల్ల అవి తీపి ఎక్కువైపోతుంది. అవసరమైతే స్మూతీకి 1 టీస్పూన్ (4 గ్రా) కంటే ఎక్కువ జోడించవద్దు. కోల్డ్ కాఫీ లేదా ఐస్డ్ టీకి ఎంత చక్కెర వేయాలంటే..? కోల్డ్ కాఫీ, ఐస్డ్ టీలలో సాఫ్ట్ డ్రింక్‌లో ఉన్నంత చక్కెర ఉంటుంది. తియ్యని బాదం (almond) లేదా ఓట్ పాలను వాడండి. క్రమంగా చక్కెరను తగ్గించండి. ప్రతి సర్వింగ్‌కు 1 టీస్పూన్ (4 గ్రా) లేదా సహజ ప్రత్యామ్నాయాలను ఉపయోగించండి.
మీరు చక్కెరను పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కలుపుతున్నారో గుర్తుంచుకోండి అంతే. మీరు రోజుకు 6 టీస్పూన్ల కంటే తక్కువ తినగలిగితే మాత్రం ఆరోగ్యంగా ఉంటూనే మీకు ఇష్టమైన పానీయాలను ఆస్వాదించవచ్చు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.