జడ్చర్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. తాత మనవడు మృతి

by Aamani |
జడ్చర్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. తాత మనవడు మృతి
X

దిశ, జడ్చర్ల : కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో తాత మనవడు మృతిచెందగా తల్లికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం జడ్చర్ల మండల పరిధిలోని మాచారం వద్ద 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమనగర్ కాలనీకి చెందిన వెంకటరెడ్డి 70 టూన్ను 20 మున్నీ ఒకే కుటుంబానికి చెందిన వారు. హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ కు కారులో బయలుదేరారు ఈ క్రమంలోని జడ్చర్ల మండలం మాచవరం వద్దకు రాగానే కారు టైర్ పగలడంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పి డివైడర్ ను దాటుకుంటూ హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సును ఢీకొంది. దీంతో కారు పూర్తిగా కావడంతో కారులో వెంకటరెడ్డి, టూన్ను, తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో కారులో ఇరుక్కున్నారు.

ఈ ఘటనను గమనించిన స్థానికులు ప్రయాణికులు కారులో ఇరుక్కున్న వెంకటరెడ్డి టున్ను లను అతి కష్టం మీద బయటకు తీశారు. అప్పటికే తీవ్ర ఇరువురు స్పృహ కోల్పోయి ఉండటంతో వారిని 108 సహాయంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పరిశీలించిన వైద్యులు ఇద్దరు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో గాయపడిన టూన్ను తల్లికి చికిత్స అందించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు రోడ్డు ప్రమాదంలో జిల్లా కేంద్రంలోని ప్రేమనగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తాతా మనవడు మృతి చెందిన ఘటనతో కాలనీలో తీవ్ర విషాదఛాయలు కలుగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు జడ్చర్ల పోలీసులు తెలిపారు.

Next Story