Taste Atlas: టేస్ట్ అట్లాస్ జాబితాలో తొలిస్థానం భారతీయ వంటకం.. ఏదంటే?

by D.Reddy |   ( Updated:2025-03-18 06:59:00.0  )
Taste Atlas: టేస్ట్ అట్లాస్ జాబితాలో తొలిస్థానం భారతీయ వంటకం.. ఏదంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ గైడ్‌ 'టేస్ట్‌ అట్లాస్‌' (Taste Atlas) ప్రపంచవ్యాప్తంగా స్వీట్స్, బ్రేక్ ఫాస్ట్, నాన్ వెజ్, వెజ్.. ఇలా వివిధ కేటగిరిల్లో ఉత్తమమైన వాటికి దేశాల వారిగా ర్యాంకులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. . ఇందులో భాగంగానే తాజాగా ప్రపంచంలోని 50 ఉత్తమ బ్రెడ్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొదటి రెండు స్థానాల్లో భారత్‌కు చెందిన వంటకాలకు చోటుదక్కటం విశేషం. గార్లిక్‌ బటర్‌ నాన్‌ (Garlic Butter Naan) తొలిస్థానంలో ఉండగా అమృత్సరి కుల్సా రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడులో దొరికే పరోటాకు 6వ ర్యాంకు, ఉత్తరాది పరోటాకు 18వ ర్యాంకు దక్కాయి. ఈ జాబితాలో భటూరే వంటకం 26వ స్థానం, 35వ స్థానంలో పాత భారతీయ రోటీ ఉన్నాయి.

ఇక అట్లాస్‌ ఆయా దేశాల్లోని వివిధ వంటకాలు దక్కించుకున్న అత్యధిక స్కౌరు ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చింది. కాగా, టేస్టీ అట్లాస్‌ భారత్‌లోని బెస్ట్‌ టేస్టీ వంటకాలుగా.. బట్టర్ గార్లిక్ నాన్, అమృతసరి కుల్చా, ముర్గ్ మఖానీ, హైదరాబాదీ బిర్యానీ తదితరాలను తప్పకుండా తిని చూడాల్సిన వంటకాలుగా గతంలో ఎన్నోసార్లు పేర్కొంది. అలాగే, కొన్ని రోజుల కిందట టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని ఉత్తమ వంటకాల జాబితాలో భారతీయ వంటకాలు 12వ స్థానం దక్కించుకున్నాయి.

Read More..

summer tips: పెరుగుతోన్న ఎండల నేపథ్యంలో రాగి జావ తాగొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు?


Next Story

Most Viewed