- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సవాళ్లపై స్వారీ చేస్తునే ఆర్థిక స్థిరత్వానికి బాటలు.. బడ్జెట్ పై మంత్రి కొండా సురేఖ

దిశ, వెబ్ డెస్క్: సవాళ్లపై స్వారీ చేస్తునే ఆర్థిక స్థిరత్వానికి బాటలు వేసేలా తెలంగాణ బడ్జెట్ ను రూపొందించారని బడ్జెట్ పద్దులను ఉద్దేశించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly session) భాగంగా బుధవారం 2025-26 వార్షిక బడ్జెట్ (Budget) ను ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడ్డాక మొదటి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Minister Bhatti Vikramarka) అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ రూ.3,04,965 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉందని భట్టి తెలిపారు.
ఈ బడ్జెట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన కొండా సురేఖ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిన రాష్ట్ర రెండో బడ్జెట్ ఉందని అన్నారు. అలాగే సీఎం రేవంత్ (CM Revanth Reddy) అన్న, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఈరోజు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి, తగిన మేరకు కేటాయింపులు చేయడం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాక డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ సమ్మిళిత వృద్ధిని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నానని తెలిపారు. ఒక వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సముతుల్యత చేస్తూ.. రాష్ట్ర బడ్జెట్ దిశానిర్ధేశం చేసేలా ఉందని కొనియాడారు.
రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఉందని, ఉపాధి కల్పనకు ఊతం ఇస్తూ.. మహిళా సంక్షేమం, యువత, దళితులు, గిరిజనుల సంక్షేమానికి దిక్సూచీలా ఉందని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్‌ను భట్టి విక్రమార్క రూపొందించడం ప్రశంసనీయమని అన్నారు. సవాళ్ళపై స్వారీ చేస్తూనే.. రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజల ఆర్ధిక స్ధిరత్వానికి బాటలు వేస్తుందని, అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్కకి, శాసనమండలిలో ప్రవేశపెట్టిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి మహిళా మంత్రి అభినందనలు తెలియజేశారు.
Read More..
TG Budget: హైదరాబాద్ ఇక ‘H-CITY’.. రూ.7,032 కోట్ల నిధులు కేటాయింపు