విద్యార్థులకు అలర్ట్.. కెనడాలో చదువుకోవడం పెద్ద స్కామ్.. రెడ్డీట్ పోస్టు వైరల్

by D.Reddy |   ( Updated:2025-03-19 15:43:15.0  )
విద్యార్థులకు అలర్ట్.. కెనడాలో చదువుకోవడం పెద్ద స్కామ్.. రెడ్డీట్ పోస్టు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్నేళ్లుగా భారత్‌లో (India) విదేశీ విద్యకు ప్రాధాన్యత పెరుగుతోంది. చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల (Higher education) కోసం విదేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడాకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే వేరే దేశాలకు వెళ్లి చదువుకోవడం అంటే అంత ఈజీ కాదు. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది బ్యాంకు లోన్లు తీసుకుని, అప్పులు జేసి, ఆస్తులు అమ్మి మరీ విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్‌గా మారింది. ఓ భారతీయ విద్యార్థి కెనడాలోని (Canada) విదేశీ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రెడ్డీట్‌లో (Reddit) పోస్టు చేశాడు. అతడు కెనడా వెళ్లినందుకు పశ్చాత్తాప పడుతున్నట్లు అందులో పేర్కొన్నాడు. అలాగే, కెనడా విదేశీ విద్యార్థులు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను వివరించాడు.

కెనడా ప్రభుత్వం, అక్కడి యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులను వ్యాపార వస్తువులుగా చూస్తున్నాయని, కెనడా విద్యా వ్యవస్థ పెద్ద స్కామ్‌ అని ఆ విద్యార్థి పోస్టులో తెలిపాడు. కెనడా వచ్చే చాలా మంది విద్యార్థులు అవగాహన లోపంతో అధిక ఫీజులు చెల్లించి తక్కువ ర్యాంకింగ్ ఉన్న వర్సిటీల్లో సీటు పొందుతున్నట్లు చెప్పాడు. అలాగే, నేటి పోటీ ప్రపంచానికి సరిపడే కోర్సులు కూడా ఆయా వర్సిటీల్లో లేవని, ఆ కోర్సులతో ఉద్యోగాలు పొందటం కష్టమని పోస్టులో పేర్కొన్నారు. అతడు కాల్గరీలో ఉన్న బౌ వ్యాలీ కాలేజీలో చదువుతున్నానని, అది చాలా చెత్త కాలేజ్ అని పేర్కొన్నారు.

అలాగే, కెనడాలో లివింగ్ కాస్ట్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. రూమ్ రెంట్, నిత్యావసరాల కోసం తప్పనిసరిగా పార్ట్ టైం జాబ్స్ చేయలన్నాడు. అనేక మంది యజమానులు అంతర్జాతీయ విద్యార్థులను చట్టవిరుద్ధంగా తక్కువ జీతాలు చెల్లిస్తూ దోపిడీ చేస్తున్నారని కూడా పోస్ట్‌లో పేర్కొన్నాడు. అలాగే, విదేశాల్లో నివసించటం వల్ల ఎమోషనల్‌గా కూడా తీవ్ర కుంగుబాటుకు లోనవుతామని వివరించాడు. ఒంటరితనంతో చాలా మంది విద్యార్థులు బాధపడుతుంటారని చెప్పాడు.

విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారు అన్ని వివరాలు సరిగా తెలుసుకోవాలని సూచించాడు. తమ ప్రణాళికలను ఒకటి రెండుసార్లు పున:పరిశీలించుకోలన్నాడు. భారతదేశం అభివృద్ధి చెందుతుందని, అక్కడే ఉండి మెరుగైన అవకాశాలు కల్పించుకునేందుకు ప్రయత్నించాలన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. పలువురు నెటిజన్లు ఈ విద్యార్థిని సమర్థిస్తుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read More..

సునీతా విలియమ్స్ ధైర్యం లక్షలాది మందికి స్పూర్తినిస్తుంది: ప్రధాని మోడీ

I regret moving to Canada byu/Hefty-Ad1 indelhi

Next Story