- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జీవీఎంసీలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన ఆరుగురు కార్పొరేటర్లు

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జీవీఎంసీ పీఠాన్ని ఈసారి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే వైసీపీకి పలువురు కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. తాజాగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు పసుపు జెండా కప్పుకున్నారు. మరి కొంత మంది కార్పొరేటర్లు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వైసీపీకి జీవీఎంసీలో పట్టు సడలుతోంది. టీడీపీ అధిక్యం పెరుగుతోంది.
మరోవైపు జీవీఎంసీ మేయర్‌పై పలువురు కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. ఇదే కానీ జరిగితే మేయర్ అవిశ్వాసాన్ని నెగ్గాలి. నెగ్గని పక్షంలో మేయర్ పీఠం చేజారుతుంది. దీంతో జీవీఎంసీ మేయర్ కోసం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలో మెజార్టీ సభ్యులు కూటమి వైపు మొగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు.