- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rain Alert : పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో గత కొద్దిరోజులుగా భానుడు ప్రతాపం చూపించగా.. గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈరోజు పగలు అంతా తీవ్రమైన ఎండ ఉండగా.. సాయంత్రానికి మబ్బులు పట్టి ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు(Rains) కురుస్తున్నాయి. నిర్మల్, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, అదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం(Thunderstorms) కురుస్తోంది. అలాగే ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో మరికొద్ది గంటల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) లో మాత్రం వాతావరణం పొడిగా ఉండనుందని తెలిపారు. అయితే గత పదిరోజుల నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగగా.. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోయారు. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే మరో రెండురోజులపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.