- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్‌గా కిర్స్టీ కోవెంట్రీ.. తొలి మహిళా అధ్యక్షురాలిగా ఘనత

దిశ, స్పోర్ట్స్ : ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) ప్రెసిడెంట్‌గా జింబాబ్వేకు చెందిన కిర్స్టీ కోవెంట్రీ ఎన్నికైంది. ఐవోసీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళగా, తొలి ఆఫ్రికన్‌గా ఆమె ఘనత సాధించింది. అలాగే, 41 ఏళ్ల ఆమె ఈ బాధ్యతలు చేపట్టబోయే అతిపిన్న వయస్కురాలు కూడా. గురువారం జరిగిన ఐవోసీ సెషన్‌లో కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవి కోసం కిర్స్టీతోపాటు ఏడుగురు పోటీపడ్డారు. అందులో ఆమె 97 ఓట్లలో 49 ఓట్లు సాధించి విజయం సాధించింది. 12 ఏళ్లపాటు అధ్యక్షుడిగా ఉన్న థామస్ బాచ్(జర్మనీ) నుంచి కిర్స్టీ బాధ్యతలు చేపట్టనుంది. ప్రస్తుతం జింబాబ్వే క్రీడా మంత్రిగా ఉంది. మాజీ స్విమ్మర్ అయిన కిర్స్టీ 2004, 2008 ఒలింపిక్స్‌లలో గోల్డ్ మెడల్స్ సాధించింది. మరో నాలుగు రజతాలు, ఓ కాంస్యం గెలుచుకుంది. ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత కిర్ట్సీ మాట్లాడుతూ..‘ఇది అసాధారణమైన క్షణం. ఇది గొప్ప గౌరవం. ఐవోసీని విలువలతో నడిపిస్తా. మీరు ఈ రోజు తీసుకున్న నిర్ణయానికి మీరందరూ గర్వపడేలా చేస్తా.’ అని తెలిపింది.