- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేయండి

దిశ, సంగారెడ్డి అర్బన్ : విధులకు సరైన సమయానికి రాకుండా ఆలస్యంగా వచ్చిన వారందరికీ షోకాస్ నోటీసులు అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది హాజరు పట్టికను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. 9.15 దాటిన తర్వాత వచ్చిన వారందరికీ వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్ కు ఆదేశించారు. అలాగే చెప్పా పెట్టకుండా విధులకు డుమ్మా కొట్టిన వారందరి లిస్టు తీసి వారికి కూడా నోటీసులు జారీ చేయాలని సూచించారు.
ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది విధులకు సరిగా రాకుండా నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని కలెక్టర్ క్రాంతి హెచ్చరించారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే సిబ్బంది లక్ష్యమని ఆమె అన్నారు. అలాగే రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు పలు సూచనలను అందజేశారు. ఎక్కడ కూడా రోగులకు ఇబ్బంది కలగకుండా వైద్యం అందించి నిత్యం వారికి అందుబాటులో ఉండాలని సూచించారు.
ఆస్పత్రి నిర్మాణ పనులు పరిశీలన
కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్రాంతి పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా పలు సూచనలను అక్కడ సిబ్బందికి అందజేశారు. అలాగే జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కోసం ఏవైనా పరికరాలు ఇతర అవసరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి మంజూరు కోసం తగిన చర్యలు తీసుకుంటామని సిబ్బందికి చెప్పారు. ఆమె వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ ఇతర సిబ్బంది ఉన్నారు.