- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సరిహద్దులో ఉద్రిక్తత

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దుండగుల దాడిలో బోసు మృతి చెందడంపై గ్రామస్థులు ఆందోళకు దిగారు. జీలుగుమిల్లి రోడ్డుపై బైఠాయించారు. బోసు మృతి కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బోసు మృతి కారణాలు తెలియజేయాలని నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించామని చెప్పారు. నిందితులను సైతం అదుపులోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బోసు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని గ్రామస్తులు కోరారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.