- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కారుకు చలానా వేసిన పోలీసులకు షాక్ ఇచ్చిన డాక్టర్.. వీడియో వైరల్

దిశ, వెబ్ డెస్క్: కారుకు చలానా వేసిన పోలీసులకు ఓ డాక్టర్ షాక్ (Shock) ఇచ్చాడు. దీంతో పోలీసులు చలానా ను క్యాన్సిల్ చేసి, పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttarprdesh) లోని బీజాపూర్ (Bijapur) కు చెందిన లోకేంద్ర సింగ్ (Lokendra singh) అనే వైద్యుడు (Doctor) కారులో హెల్మెట్ పెట్టుకొని నడుపుతున్నాడు. దాని వెనుక బీజాపూర్ పోలీసుల తీరుపై ఆయన చేస్తున్న ఆందోళన దాగి ఉన్నదని తెలియక.. కారులో హెల్మెట్ (Helmet) ఎందుకా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఒకసారి లోకేంద్ర సింగ్ కారులో వెళుతుండగా.. హెల్మెట్ ధరించనందుకు తన కారుకు బీజాపూర్ పోలీసులు (Bijapur Police) రూ.1000 చలానా (Challane) విధించారు. దీనిపై ఆ డాక్టర్ వివరణ కోరగా.. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోయాడు. దీంతో అతను కారులో వెళుతున్న ప్రతీసారి హెల్మెట్ ధరిస్తూ వింతగా నిరసన (Protest) తెలియజేస్తున్నారు. దీనిని కొందరు వ్యక్తులు వీడియో తీస్తూ.. హెల్మెట్ ధరించడానికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఆయన కారులో హెల్మెట్ లేనందుకు కారుకు చలానా వేశారని, అడిగితే దురుసుగా ప్రవర్తించారని, అందుకే ఇలా చేసినట్లు లోకేంద్ర చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసుల తమ పొరపాటును సరిదిద్దుకున్నారు. లోకేంద్రకు పోరపాటున చలానా జారీ చేశామని, దాన్ని రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.