- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుడ్ న్యూస్ చెప్పిన నితిన్.. ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ రాబోతుందంటూ ఆసక్తికర కామెంట్స్ (వీడియో)

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin)‘రాబిన్‌హుడ్’(Robinhood)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే ఆయన తమ్ముడు, ఎల్లమ్మ అనే మూవీస్ కూడా చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో ‘తమ్ముడు’(thammudu) టైటిల్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా పేరు కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు(Sriram Venu) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు (dil raju), శిరీష్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
అయితే ‘తమ్ముడు’ చిత్రాన్ని మే 9న థియేటర్స్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై మంచి రెస్పాన్స్‌కు దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నితిన్ ‘రాబిన్‌హుడ్’ప్రమోషన్స్‌లో భాగంగా ‘తమ్ముడు’సినిమా అప్డేట్ రాబోతున్నట్లు వెల్లడించారు. ‘‘తమ్ముడు’ మూవీ షూటింగ్ అంతా పూర్తి అయింది. ఒక సాంగ్ మాత్రమే చీత్రీకరించాలి. అది కూడా ఏప్రిల్‌లో చేస్తాము. తమ్ముడు ట్రైలర్ రాబిన్‌హుడ్ విడుదల తర్వాత వారానికి వస్తుంది. ఈ సినిమాలో కొత్తరూపం చూస్తారు. ‘రాబిన్‌హుడ్’లో ఉన్నదానికంటే మించి నా యాక్షన్స్ సీన్స్ ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నితిన్ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
#Thammudu ట్రైలర్ రెడీ అయింది... #Robinhood రిలీజ్ తర్వాత రిలీజ్ చేస్తాం - @actor_nithiin pic.twitter.com/ffeKpsMmSw
— Rajesh Manne (@rajeshmanne1) March 24, 2025