- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Supreme Court: మా వద్దే డీలే ట్యాక్టిక్స్ వద్దు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ధర్మాసనం ఆగ్రహం

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత వేటు (Brs Mlas Defection) పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్ (Justice Gavai) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని ఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదన్నారు. అలాంటప్పుడు ఆ తీర్పులను కాదని ఎలా ముందుకు వెళ్లగలం? ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలం అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. చర్యలు తీసుకోవడానికి రీజనబుల్ కాలం అంటే అసలు ఎంత కాలం? పదవీ కాలం పూర్తయ్యేవరకు అది రీజనబుల్ టైమ్ అవుతుందా అని ప్రశ్నించింది. ఈ అంశంలో మొదటి ఫిర్యాదు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. నిర్ణయం తీసుకోవడానికి తగిన టైమ్ అంటూ ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.
స్పీకర్ విధుల్లో జోక్యం కోరుకోవట్లేదు:
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శేషాద్రినాయుడు, ఆర్యమా సుందరం వాదనలు వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం అనర్హత పిటిషన్ విచారణార్హతను పరిశీలించాలి. అర్హత లేకపోతే పిటిషన్ ను డిస్మిస్ చేయాలి. విచారణార్హత ఉంటే స్పీకర్ నోటీసులు ఇవ్వాలని సుందరం వాదించారు. స్పీకర్ నోటీసులకు వారంలోగా సమాధానం ఇవ్వాలి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం న్యాయసమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాక వారంలో సమాధానం ఇవ్వాలన్న నిబంధన ఉంది. కానీ వారు 4 నెలల సమయం కోరారు. ఇంగ్లాండ్ లో స్పీకర్ అయితే వారు రాజకీయాల్లో ఉండరు. కానీ భారత్ లో ఆ పరిస్థితి లేదని సుందరం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దాంతో మనది వైబ్రెంట్ డెమెక్రసీ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో మన దేశంలో ప్రజాస్వామ్యం మరింత ఎక్కువగా ఉందని స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు న్యాయ సమీక్ష చేయొద్దంటున్నారని సుందరం కోర్టుకు వివరించారు. స్పీకర్ నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోవడం లేదు. ఇది న్యాయసమీక్ష కాదు, జోక్యం కూడా కాదు. కేవలం స్పీకర్ విధులు నిర్వర్తించాలని మాత్రమే కోర్టు చెబుతోందని సుందరం అన్నారు.
దీంతో న్యాస్థానాలు చేతులు కట్టేయడం కుదరదని న్యాయస్థానం బదులించ్చింది. సుభాశ్ దేశాయ్ కేసును ఉదహరించిన సుందరం.. ఆ కేసులో నిర్ణీత సమయం కేటాయించింది. గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు తర్వాత షెడ్యూల్ ఖరారు చేయలేదా అని ధర్మాసనం ప్రశ్నించగా లేదని అడ్వకేట్ సందరం సమాధానం చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని పేర్కొన్నారు. స్పీకర్ స్పందించి నోటీసులు కూడా ఇవ్వలేదని ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులపై ఏం చేస్తారో 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయినా స్పీకర్ పార్టీ మారిన వారికి నోటీసులు ఇవ్వలేదు. ఆ తర్వాత ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటిసులు ఇచ్చారని తెలిపారు. 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసు ఇచ్చారు. ఇప్పటికి మూడు వారాలైంది.. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదు. మేము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదన్నారు. స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోవాలని మేము కోరుకోవట్లేదు. స్పీకర్ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని కోరుతున్నామని న్యాయవాది సుందరం కోర్టులో వాదించారు.
మా వద్దే డీలే ట్యాక్టిక్స్ వద్దు:
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరిన ప్రతిపాదులైన ఎమ్మెల్యేలపై ధర్మాసనం సీరియస్ అయింది. తమ దగ్గర డీలే ట్యాక్టిక్స్ అమలు చేయవద్దంటూ మండిపడింది.