KIA: కారు కొందాం అనుకుంటున్నారా? అయితే ఏప్రిల్‌ 1లోపే కొనండి.. లేకపోతే అప్పు చేయక తప్పదు!

by Vennela |
KIA: కారు కొందాం అనుకుంటున్నారా? అయితే ఏప్రిల్‌ 1లోపే కొనండి.. లేకపోతే అప్పు చేయక తప్పదు!
X

Kia Price Hike: కార్ల తయారీ సంస్థలు మరోసారి ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్(Tata Motors), మారుతి సుజుకీ(Maruthi Suzuki) కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా దక్షిణ కొరియా సంస్థ కియా(Kia Price Hike) కూడా తన లైనప్ లో పలు కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, సప్లై చైన్ సవాళ్లు ఈ ధరల పెరుగుదులకు కారణమని కియా మోటార్స్(Kia Motors)వెల్లడించింది.

కియా ఇండియా(Kia India) తన లైనప్ లోని కార్లపై 3శాతం ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెరుగుదల దాని పూర్తి మోడల్ లైనప్ అంతటా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ధరల పెంపు ఏప్రిల్ 1,2025 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ముడి సరుకుల ధరలు పెరగడం, సప్లై చైన్ వ్యయాలు పెరగడమే ఈ నిర్ణయానికి కారణమని కొరియా కార్ల తయారీ సంస్థ కియా తెలిపింది.

ప్రస్తుతం కియా ఇండియా(Kia India)లో సోనెట్(Sonet), కార్నివాల్(Carnival), కారెన్స్(Karens) , ఈవీ9(ev9), సెల్టోస్(Seltos), సైరోస్(Cyrus), ఈవీ6 వంటి మోడళ్లను అందిస్తుంది. వీటిలో ఒక్కో మోడల్ పై ఎంత ధరను పెంచనున్నారనే విషయాన్ని ధరల పెరుగుదల అమలు తేదీకి కొన్ని రోజులు ముందు ప్రకటిస్తారు. కియా కార్(Kia Motors) ను కొనే ప్లాన్ లో ఉన్న కొనుగోలుదారులు ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే ఏప్రిల్ 1 కంటే ముందు తమ వాహనాలను బుక్ చేసుకోవడం మంచిది.

ఫిబ్రవరిలో 23.8శాతం వార్షిక వ్రుద్ధిని సాధించినట్లు కియా(Kia Motors) ప్రకటించింది. 2024 ఫిబ్రవరిలో 20,200 యూనిట్లను విక్రయించగా..2025 ఫిబ్రవరిలో కంపెనీ 25,026 యూనిట్లను విక్రయించింది. అయితే భారత్ లోని పోటీ దారులు ఇప్పటికే ధరల పెరుగుదదలను ప్రకటించిన నేపథ్యంలో తాము కూడా కార్ల ధరలను పెంచాలని కియా(Kia Motors) నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో కియా ఇండియా (Kia Motors)5,245 యూనిట్ల సైరోస్ ను విక్రయించింది.

అలాగే ఇప్పటికే ఈ కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ కోసం 20,000 బుకింగ్స్ సిద్ధంగా ఉన్నాయి. కియా(Kia Motors) లైనప్ లో ఈ ఫిబ్రవరిలో కియా సోనెట్ 7,598 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలవగా..సెల్టోస్ 6,446 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. గత నెలలో 5,318 యూనిట్లను పంపిన కారెన్స్ ఎమ్ పివి గణనీయంగా పెరిగింది. అయితే కొత్త కార్నివాల్ 239 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. ఎగుమతుల పరంగా కియా (Kia Motors)ఫిబ్రవరిలో 70కిపైగా అంతర్జాతీయ మార్కెట్లకు 2,042 యూనిట్లను రవాణా చేసింది.

Next Story