గంగబండతండాలో ఉద్రిక్తత.. యువకుడు మృతితో పోలీసులు అలర్ట్

by Kalyani |
గంగబండతండాలో ఉద్రిక్తత.. యువకుడు మృతితో పోలీసులు అలర్ట్
X

దిశ, కూసుమంచి రూరల్: కూసుమంచి మండలంలోని గంగబండతండాలో శుక్రవారం కొద్ది గంటల పాటు ఉద్రిక్తత ఏర్పడింది. ఓ యువకుడు మృతి చెందడంతో పలువురిని అనుమానిస్తూ ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళన చేస్తామని బంధవులు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గంగబండతండాకు చెందిన బానోతు కోట్యా, సీతమ్మ దంపతుల కుమారుడు బానోతు ఉపేందర్(25) గత కొద్ది రోజులు క్రితం ఎలుకల మందు తాగి అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే బంధువులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల పాటు చికిత్స పొందిన ఉపేందర్ శుక్రవారం మృతి చెందాడు.

దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్థులపై అనుమానం వ్యక్తం చేస్తూ కూసుమంచి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇచ్చారు. వారి ఇంటి వద్ద శవంతో ఆందోళన చేస్తామని చెప్పడంతో కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్ఐ నాగరాజు అప్రమత్తమై కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినలేదు. అంతే కాకుండా ఒకరి ఇంటిపై రాళ్ళతో దాడికి యత్నించినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు తండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఉపేందర్ అంత్యక్రియలు పూర్తి చేశారు.

Next Story

Most Viewed