- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
PM Modi: వచ్చే నెల విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) వచ్చే నెల మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. గతేడాది భారత్, శ్రీలంక (Srilanka) మధ్య కుదిరిన ఒప్పందాలను ఖరారు చేయడానికి ప్రధాని మోడీ ఏప్రిల్ 5వ తేదీన పొరుగు దేశం శ్రీలంక వెళ్లనున్నారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక (President Anura Kumara Dissanayake) ప్రకటించారు. శ్రీలంకలో సుస్థిర పరిస్థితుల కారణంగా మోడీ సందర్శిస్తున్నారని దిస్సనాయకె తెలియజేశారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ట్రింకోమలీలో సాంపూర్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
కాగా, శ్రీలంక, భారత్ మధ్య సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి గత నెల ఒక ఒప్పందం కుదిరింది. శ్రీలంకలోని ట్రింకోమలీ జిల్లా సాంపూర్‌లో 50 మెగావాట్ల (మొదటి దశ), 70 మెగావాట్ల (రెండవ దశ) సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సిలోన్ విద్యుత్ బోర్డు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NTPC) రెండు ప్రభుత్వాల మధ్య జాయింట్ వెంచర్‌గా ఈ నిర్మాణం చేపట్టనున్నాయి. అంతకుముందు NTPC అదే స్థలంలో బొగ్గు ఇంధనంగా విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించవలసి ఉంది. కొత్త సంయుక్త రంగ సంస్థ దానిని సౌర విద్యుత్ కేంద్రంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది.