- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ లిప్ లాక్ సీన్ చేసినప్పుడు పెద్ద వివాదం ఏర్పడుతుందని నాకు అప్పుడే తెలుసు.. పవన్ కళ్యాణ్ బ్యూటీ సంచలన కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్(Nithyamenon) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే సింగర్‌గా కూడా కొన్ని సాంగ్స్ పాడింది. ఇక ‘తిరుచిత్రంబలం’(Thiruchitrambalam) మూవీకి ఏకంగా జాతీయ అవార్డు అందుకుని ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
అయితే ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ‘కాదలిక్క నేరమిల్లై’(Kadhalikka Neramillai) మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘“నేను హిందీలో ‘బ్రీత్ ఇన్ టు ది షాడోస్’(Breath In To The Shadows) అనే వెబ్ సిరీస్‌లో నటించాను. అది మంచి షూటింగ్ అనుభవం. అది నా కెరీర్‌లో కూడా మైలురాయి. ఆ సిరీస్‌లోని ఆ లిప్ లాక్ సన్నివేశం సినిమా మొత్తం మూడ్‌కి చాలా ముఖ్యమైనది.
కానీ ఆ సీన్ చేసినప్పుడు పెద్ద వివాదం ఏర్పడుతుందని నాకు అప్పుడే తెలుసు. స్క్రిప్ట్‌లో అలాంటి సన్నివేశం అవసరమైతే, భవిష్యత్ సినిమాల్లో కూడా చేయడానికి నేను వెనుకాడను. నేను అప్పుడూ, ఇప్పుడూ ఇలాంటి వివాదాలకు ఎప్పుడూ భయపడలేదు. చాలా వివాదాలు తలెత్తినప్పుడు, అది నా చెవులకు చేరే చివరి విషయం. అయినప్పటికీ, నేను సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చదివాను. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే.. నెగిటివ్ కామెంట్స్ లేకుండా సానుకూలంగా ఏమీ జరగదు.
నేను దాని గురించి ఆలోచించను. అప్పుడే నాకు దానికి సమయం దొరుకుతుంది. ఇతరులు ఏమనుకుంటారో అని చింతిస్తూ, ఒత్తిడిలో నేను పని చేయలేను. నా వ్యవహారాలు నేనే నిర్ణయించుకుంటాను. నా మనసులో నాకు అనిపించే దాని ప్రకారం జీవించడమే నాకు ఇష్టం. నేను చెప్పేది, చేసేది అన్నీ నా మనసు చెప్పినట్టే ఉంటాయి. నా నిర్ణయాలను లేదా నా ఆనందాన్ని బయటిది ఏదీ ప్రభావితం చేయదు” అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.