- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం..
by Sumithra |

X
దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామ శివారులో ఖమ్మం - అశ్వారావుపేట జాతీయ రహదారి పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా లారీ, డీసీఎం వ్యాన్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందగా, మరొక ముగ్గురుకి తీవ్రగాయాలు అయ్యాయి. ఎదురెదురుగా ఢీ కొన్న వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆరు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ రోడ్డు ప్రమాదంలో నాగాలాండ్ కు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న దమ్మపేట పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలం దగ్గర చేరుకొని జేసీబీల సహాయంతో లారీలను పక్కకు తొలగించారు. గాయపడ్డ వారిని అంబులెన్సుల సహాయంతో దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story