- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆలోపే నిర్ణయం తీసుకోండి.. ప్రభుత్వానికి BJP ఎమ్మెల్యే సూచన

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ జనాభాను కులగణనలో తగ్గించి చూపించారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మాకు అనుమానాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. బీసీలు 56 శాతం ఉన్నప్పటికీ 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని, అయినా దీనిని తాము ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే ఇందులో ముస్లిం మైనార్టీలకు 10 శాతం మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర బీసీలు గమనిస్తున్నారని, ముస్లిం మైనార్టీలకు 10 శాతం ఇస్తే ఇది బీసీలను మోసం చేసినట్టే అవుతుందన్నారు. ఈ విషయంలో బీసీలు ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా అడగాలని కోరుతున్నానన్నారు.
ఈ విషయంలో తాము ప్రభుత్వాన్ని అడిగినా ఈ విషయంలో తమకు సమాధానం రాలేదని పాయల్‌శంకర్ ఆరోపించారు. ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, ఆలోపు నిర్ణయం తీసుకోకపోతే సోమవారం జరిగే చర్చలో దీన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు. డీలిమిటేషన్విషయం ఇంకా కొలిక్కి రాలేదని, కానీ అప్పుడే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చెన్నైలో జరిగే సభకు వెళ్తున్నారంటే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని స్పష్టం అవుతోందని పాయల్‌శంకర్ ఆరోపించారు.