గుర్తు తెలియని మృతదేహం లభ్యం.. ఆకలి చావా, వడదెబ్బా..

by Sridhar Babu |
గుర్తు తెలియని మృతదేహం లభ్యం.. ఆకలి చావా, వడదెబ్బా..
X

దిశ, శామీర్ పేట్ : శామీర్ పేట్ పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం లభించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతవారం రోజుల నుంచి తూంకుంట మున్సిపాలిటీలోని వెంకటేశ్వర కాలనీలో గుర్తు తెలియని మతి స్థిమితం లేని వ్యక్తి చొక్కా, చెప్పులు లేకుండా సంచరిస్తుండటం కాలనీవాసులు గమనించారు. కాగా శుక్రవారం వెంకటేశ్వర కాలనీలోని ఓపెన్ వెంచర్లో అతను చనిపోయి ఉన్నాడని కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా గత వారం రోజుల నుంచి తిండి, నీరు లేక వడదెబ్బ వలన చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story