మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం : కలెక్టర్

by Kalyani |
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం : కలెక్టర్
X

దిశ, కొత్తగూడెం : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి కార్యాలయంలోని ముస్లిం ఉద్యోగులకు నిర్వహించిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింల‌కు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. అనంతరం ఉద్యోగులు కలెక్టర్ కు ఖురాన్ ను బహుకరించారు.

Next Story