- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల దావత్.. నిధులకు నో ఢోకా

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల దావత్ ఏ ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్షబ్బీర్ అలీతో కలిసి సమీక్షించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఇఫ్తార్విందు కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ విందు కోసం ఆహారంలో నాణ్యత, ప్రోటోకాల్, సౌకర్యాల కల్పనలో అధికారులు ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇఫ్తార్విందు ఏర్పాట్లలో అధికారులు ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని, చిన్న పొరపాటు కూడా అవకాశం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ వేడుకలో లా అండ్ ఆర్డర్, ఎలక్ట్రిసిటీ, మంచినీరు తదితర అంశాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరారు. వీటి ఏర్పాట్లలో ఎలాంటి అనుమానాలు, ఇబ్బందులు ఎదురైనా అధికారులు మొహమాట పడకుండా హైదరాబాద్జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఇఫ్తార్విందు ఏర్పాట్లకి గాను ప్రభుత్వ సలహాదారులు, ఏర్పాట్ల కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్షబ్బీర్ అలీ ఇక రోజువారిగా సమీక్ష చేస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులకు ఏలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ముస్లింల దావత్ ఏ ఇఫ్తార్ విందును కూడా ఘనంగా చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం దావత్ ఏ ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. ఇఫ్తార్విందుకు సంబంధించిన అన్ని విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.